All Islam Directory
1

కాదు, నేను ఈ నగరం (మక్కా) సాక్షిగా (అంటున్నాను)!

2

మరియు నీకు ఈ నగరంలో (మక్కాలో) స్వేచ్ఛ ఉంది.

3

మరియు తండ్రి (మూలపురుషుడు) మరియు అతని సంతానం సాక్షిగా!

4

వాస్తవానికి, మేము మానవుణ్ణి శ్రమజీవిగా పుట్టించాము.

5

ఏమిటి? తనను ఎవ్వడూ వశపరచుకో లేడని అతడు భావిస్తున్నాడా?

6

అతడు: "నేను విపరీత ధనాన్ని ఖర్చు పెట్టాను!" అని అంటాడు.

7

ఏమిటి? తనను ఎవ్వడూ చూడటం లేదని అతడు భావిస్తున్నాడా?

8

ఏమిటి? మేము అతనికి రెండు కళ్ళు ఇవ్వలేదా?

9

మరియు నాలుకను మరియు రెండు పెదవులను.

10

మరియు అతనికి (మంచీ - చెడూ) అనే స్పష్టమైన రెండు మార్గాలను చూపాము.

11

కాని అతడు కష్టతరమైన ఊర్ధ్వ గమనానికి సాహసించలేదు!

12

మరియు ఆ ఊర్ధ్వగమనం అంటే ఏమిటో నీకు తెలుసా?

13

అది ఒకని మెడను (బానిసత్వం నుండి) విడిపించడం.

14

లేదా! (స్వయంగా) ఆకలి గొని ఉన్న రోజు కూడా (ఇతరులకు) అన్నం పెట్టడం.

15

సమీప అనాథునికి గానీ;

16

లేక, దిక్కులేని నిరుపేదకు గానీ!

17

మరియు విశ్వసించి, సహనాన్ని బోధించేవారిలో! మరియు కరుణను ఒకరి కొకరు బోధించుకునే వారిలో చేరిపోవడం.

18

ఇలాంటి వారే కుడిపక్షం వారు.

19

ఇక మా సందేశాలను తిరస్కరించిన వారు, ఎడమ పక్షానికి చెందినవారు.

20

వారిని నరకాగ్ని చుట్టుకుంటుంది.