114 - Mankind - An-Nās
1
ఇలా అను: "నేను మానవుల ప్రభువు (అల్లాహ్) ను శరణుకై వేడుకుంటున్నాను!
2
మానవుల సార్వభౌముడు!
3
మానవుల ఆరాధ్యదైవం (అయిన అల్లాహ్ యొక్క శరణు)!"
4
కలతలు రేకెత్తించి తొలగిపోయేవాని కీడు నుండి;
5
ఎవడైతే మానవుల హృదయాలలో కలతలు రేకెత్తిస్తాడో!
6
వాడు జిన్నాతులలోని వాడూ కావచ్చు లేదా మానవులలోని వాడూ కావచ్చు!