113 - The Daybreak - Al-Falaq
1
ఇలా అను: "నేను ఉదయ కాలపు ప్రభువు అయిన (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను.
2
ఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి;
3
మరియు చిమ్మచీకటి కీడు నుండి, ఎప్పుడైతే అది క్రమ్ముకుంటుందో!
4
మరియు ముడుల మీద మంత్రించి ఊదే వారి కీడు నుండి;
5
మరియు అసూయపరుడి కీడు నుండి, ఎప్పుడైతే అతడు అసూయపడతాడో!"