109 - The Disbelievers - Al-Kāfirūn
1
ఇలా అను: "ఓ సత్యతిరస్కారులారా!
2
మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించను;
3
మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను (అల్లాహ్ ను) మీరు ఆరాధించేవారు కారు.
4
మరియు మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించేవాణ్ణి కాను;
5
మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను మీరు ఆరాధించేవారు కారు.
6
మీ ధర్మం మీకూ మరియు నా ధర్మం నాకు!"